CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
CM KCR : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం .. 30వ తేదీ నుంచి పంపిణీ షురూ..!
హైదరాబాద్ , మన సాక్షి :
ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు శుభవార్త తెలియజేశారు. జూన్ 30వ తేదీ నుంచి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పోడుభూముల రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పోడు భూముల రైతులకు అధికారులు పట్టాల సిద్ధం చేశారు.?
పోడు భూముల పట్టాల పంపిణీలో మొదటి ప్రాధాన్యగా గిరిజనులకు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోడు పట్టాలు వస్తాయో..? రావో ..?అని ఇంతకాలం ఎదురుచూసిన గిరిజనులు సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆనందంలో మునిగిపోతున్నారు.
ఎక్కువ మంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి👇
- Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!
- Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
- Kcr Govt Record : కెసిఆర్ సర్కార్ మరో రికార్డ్ .. ఆసియాలోనే అతిపెద్ద కాంప్లెక్స్, అదిరిపోయేలా సౌకర్యాలు..!
- Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!
- RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!
జూన్ 24వ తేదీ నుంచి పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం వలన, 23,న అన్ని జిల్లాల కలెక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటం వలన, దాంతోపాటు ఈనెల 29వ తేదీన బక్రీద్ పండుగ ఉండడం వలన.. అనివార్య కారణాలవల్ల జూన్ 30వ తేదీకి పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మార్చడం జరిగింది.?
జూన్ 30వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆ జిల్లా నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.









