Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!
Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా రేపటి నుంచి రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్పపీడన ప్రభావం వల్ల ఈనెల 25, 26, 27, మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ALSO READ :
1. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
2. GOOGLE : మీరు ఇలా చేయకుంటే Google త్వరలో మీ Gmail , YouTube ఖాతాలను తొలగిస్తుంది..!
3. Telangana : తెలంగాణలో విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!
4. Forest : అడవుల నుంచి బయటికి పరుగులు పెడుతున్న జింకలు.. (వీడియో చూడండి)
రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేసే అవకాశం ఉంది. ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది . హైదరాబాదులో 26 , 27వ తేదీలలో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారు లు పేర్కొన్నారు.
అదేవిధంగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి , నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిగతా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది . వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని అధికారులు పేర్కొన్నారు.










