Telangana : తెలంగాణలో విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!

Telangana : తెలంగాణలో విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులతో పాటు వివిధ శాఖలకు అనుబంధంగా నిర్వహిస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు .

 

గురుకుల హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజన వసతులు కల్పించేందుకు డైట్ చార్జీల పెంపుదలకు కేసీఆర్ శనివారం ఫైల్ పై సంతకం చేశారు. పెరిగిన డైట్ చార్జీలను జూలై నెల నుంచే అమల్లోకి రానున్నాయి.

 

పెరిగిన డైట్ చార్జీల వివరాలు :

♦️మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ప్రతినెల 950 రూపాయలు అందిస్తుండగా పెరిగిన చార్జీల ప్రకారం 1200 రూపాయలు అందిస్తారు.

♦️ 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రస్తుతం 1100 రూపాయలు డైట్ చార్జీలు కాగా 1400 రూపాయలకు పెరిగాయి.

♦️ 11వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు 1500 రూపాయలు డైట్ చార్జీల అందిస్తుండగా 1875 రూపాయలకు పెరిగాయి.

 

ALSO READ : 

  1. Social media : సోషల్ మీడియా యాక్టివ్ యూజర్స్ 500 కోట్లు.. జనాభాలో 60 శాతంకు పైగానే..!
  2. Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)
  3. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

 

 

గురుకుల పాఠశాలలో కళాశాలలో చార్జీల పెంపు కోసం సీఎం కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించారు. పూర్తిస్థాయి కసరత్తు అనంతరం సబ్ కమిటీ నివేదిక సమర్పించగా అనివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. పెరిగిన డైట్ చార్జీల వల్ల ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాల్లో మొత్తం 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం అందనున్నది.

 

ప్రస్తుతం అందిస్తున్న చార్జీలకు 26% చార్జీలు పెంచినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి ₹237 కోట్ల మేర అదనపు భారం పడనున్నది. ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం లెక్కచేయకుండా రాష్ట్రాలలో చదువుతున్న విద్యార్థుల కోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసిఆర్ స్పష్టం చేశారు.