Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

Viral Video : క్రిష్ లా విద్యార్థి ఫీట్స్.. పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకేశాడు..! (వీడియో వైరల్)

మనసాక్షి :

విద్యార్థులపై సినిమాల ప్రభావం తప్పక ఉంటుంది . కొంతమంది విద్యార్థులు సినిమాలను చూసి ఆ విధంగా చేయాలని భావిస్తుంటారు. మరి చిన్నవాళ్లు అయితే సినిమాలలోని పాత్రల్లో లీనమై హీరోలా.. చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. డాన్సులు, డైలాగులు.. చెప్పడంతో పాటు యాక్టింగ్, ఫీట్స్ కూడా చేస్తుంటారు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైన ఫీట్స్ కూడా చేసి ఇబ్బందుల పాలవుతుంటారు. కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటారు.

 

బాలీవుడ్ సినిమా క్రిష్ అందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్ ఈ సినిమాలో అనేక స్టంట్స్, ఫీట్స్ చేస్తారు. పెద్దపెద్ద భవనాలపై నుంచి దూకడం .. ఒక బిల్డింగ్ పైనుంచి మరో బిల్డింగ్ పైకి దూకడం ఇలాంటివి ఆ సినిమాలో ఉంటాయి. ఇవి చూసిన మూడో తరగతి విద్యార్థి కి బాగా నచ్చి అతను కూడా చేయాలని భావించాడు.

 

స్కూల్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్ కు దూకి గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన పాఠశాలలోని సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి.. 👇

1. Project K : ప్రభాస్ ప్రాజెక్టు కె గ్లింప్స్ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్ లో..! (వీడియో)

2. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

3. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

 

 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం ఒక విద్యార్థి క్రిష్ సినిమాలో హీరోలా స్టంట్ చేయబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల ప్రకారం ..

 

డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో ఎనిమిదేళ్ల బాలుడు మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి క్లాస్ జరుగుతున్న సమయంలో మంచినీళ్ల కోసం అని చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత క్రిష్ సినిమాల్లో మాదిరిగా కిందికి ల్యాండ్ కావాలని పై ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు రైలింగ్ పైకి జంప్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయాడు.

 

ఈ సంఘటనతో అతనికి కాళ్లు , చేతులకు గాయాలయ్యాయి. పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించి ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ సంఘటనలో తనకు తానే దూకేశాడని ప్రిన్సిపల్ తెలిపారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు : 

1. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

2. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!

3. Rythu : నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. 20 ఏళ్ల దరిద్రం పోయింది..!

 

 

కాగా విద్యార్థి తల్లి చెప్పిన విషయాలకు పాఠశాల యాజమాన్యం కూడా ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన కొడుకు క్రిష్ సినిమాలు చూస్తుంటాడని క్రిష్ లాగా, సూపర్ మాన్ లాగా స్టంట్ చేయాలని భావిస్తుంటాడని తెలిపింది. తాను కూడా సూపర్ మాన్ లాగా క్రిష్ లో హీరోల చేయాలని చెబుతుంటాడని ఆ విద్యార్థి తల్లి చెప్పింది.

 

ప్రస్తుతం ఆ విద్యార్థి పాఠశాల బిల్డింగ్ మీద నుంచి జంప్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నపిల్లలకు ఇలాంటి వాటి పట్ల అర్థమయ్యేలా అవగాహణ కల్పించాలని.. లేదంటే ఇలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పలువురు చెబుతున్నారు.

 

Video 👇