Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంజిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

హైదరాబాద్ , మనసాక్షి :

సోషల్ మీడియా యాప్ లో వాట్సాప్ దూసుకుపోతుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్ తప్పనిసరిగా వాడుతున్నారు. వాట్సాప్ యూజర్స్ సంఖ్య రోజుకు పెరుగుతుంది. యూజర్స్ ను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లను అందిస్తుంది.

 

వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా వాట్సాప్ కీలక మార్పులు తీసుకువస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా సైలెన్స్ కాలర్స్, చాట్ లాక్ లాంటి ఫీచర్స్ అనేకం యూజర్స్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

వాట్సాప్ లో హ్యాకర్లు హ్యాక్ చేయకుండా సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తుంది. అయినా కూడా హ్యాకర్లు వాట్సాప్ ను ఏదో ఒక విధంగా హ్యాక్ చేస్తూనే ఉన్నారు. అందుకు గాను వాట్సాప్ మరో కీలకమైన మార్పును తీసుకువచ్చింది. వాట్సాప్ సెక్యూరిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఈ కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది అదేంటో తెలుసుకుందాం ..

 

ALSO READ : 

  1. రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు వరకు మెట్రో రైలు సదుపాయం
  2. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  3. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  4. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!

 

ఒక యూజర్ వాట్సాప్ ను యాక్సెస్ చేయడానికి లేదా ఎకౌంట్ ను వెరిఫై చేయడానికి ఈమెయిల్ ఐడి ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపైన వాట్స్అప్ పనిచేస్తుంది. అయితే యూజర్ ను ధ్రువీకరించడానికి ఈమెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ యాప్ లో ఆప్షనల్ గా చేర్చనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

 

ఈమెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకుంటే మీ ఖాతా వెరిఫై కోసం తప్పనిసరిగా మెయిల్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లో పెట్టుకుంటే మెయిల్ లేకుండానే లాగిన్ కావచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది. త్వరలో ఈ ఫీచర్ అప్డేట్స్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు