రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు వరకు మెట్రో రైలు సదుపాయం

రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు వరకు మెట్రో రైలు సదుపాయం

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రత్యేక శ్రద్దతో

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రత్యేక శ్రద్దతో ఆమనగల్లు వరకు మెట్రో రైలు సదుపాయం కలుగుతుందని ఆమనగల్లు బిఆర్ఎస్ అధ్యక్షులు పొనుగోటి అర్జున్ రావు జడ్పీటీసీ అనురాధ వైస్ ఎంపీపీ అనంతరెడ్డి పేర్కొన్నారు.

 

శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆమనగల్లులో దశాబ్ద కాలంగా జరగని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం గ్రంథాలయ భవనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

 

ALSO READ :

  1. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  2. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  3. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  4. Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!

 

పాలిటెక్నిక్ కళాశాల డిగ్రీ కళాశాల డివిజన్ వ్యవసాయ శాఖ కార్యాలయం మంజూరయ్యాయని అతిత్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వారా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆమనగల్లు కేంద్రంలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ సుభాష్,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షులు పరమేష్, నాయకులు వెంకట్ రెడ్డి,పంతు,వెంకటయ్య,ప్రసాద్,భీమయ్యా, పాల్గొన్నారు.