Anganwadi : అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
Anganwadi : అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అంగన్వాడీ టీచర్లకు ఆసరా అందించడం హర్షనియమని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ సూర్యాపేట జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నాగలక్ష్మిలు అన్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు పలు వరాలు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద లక్ష మినీ అంగన్వాడీలో పనిచేసే టీచర్లు హెల్పర్లకు 50,000 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వారిలో సూర్యాపేట జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తంతేనపల్లి సుజాత, జిల్లా ఉపాధక్ష్యురాలు సోమగాని రమణ, ఉపాధక్షురాలు గుండగాని సుజాత, సెక్టర్ బాధ్యులు గాదె శైలజ, అనసూయ, సలోమి, ఇందిరా, శారద,జ్యోతి, సావిత్రి, సుజాత తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?









