Health check : మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు.. నల్గొండ జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్..!
Health check : మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు.. నల్గొండ జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్..!
ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభించిన
శాలి గౌరారం, మనసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా అందించే వైద్య సేవలు, పరీక్షలను గురించి ప్రతి మహిళలకు అవగాహన కల్పించి పి.హెచ్.సి పరిధి లోని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ సూచించారు. మంగళవారం శాలి గౌరారం పి.హెచ్.సి.లో నూతనంగా మహిళా ఆరోగ్య క్లినిక్ ను జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ప్రారంభించారు.
ప్రతి మహిళ తన ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని,ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా ఎనిమిది రకాల వైద్య సేవలు,అన్ని ఆరోగ్య పరీక్షలు మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్ ద్వార ఉచితంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి లలో మాస్టర్ హెల్త్ చెకప్ కు 3 వేల రూ.లు నుండి 5 వేల రూ.లు ఖర్చు చేయ వలసి వుంటుందని తెలిపారు.
దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య క్లినిక్ ల ద్వారా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుందని, కొల్కో స్కోపి,మమ్మో గ్రఫీ, ఈ.సి.జి.,అల్ట్రా సౌండ్ స్కానింగ్ ,రక్త పరీక్ష,మూత్ర పరీక్ష లు నిర్వహిస్తుందని తెలిపారు.
ALSO READ :
- సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- BalaiahBabu : చంద్రబాబు అరెస్ట్ తో రంగంలోకి దిగిన బాలయ్య..!
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
జిల్లాలో ఇప్పటి వరకు ఆరు నియోజక వర్గాల్లో కట్టం గూర్, నల్గొండ పట్టణం మాన్యం చెల్క, మర్రి గూడ, వేముల పల్లి, నిడమ నూరు, డిం డి పి హెచ్.సి లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 న మహిళా ఆరోగ్య క్లినిక్ లు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్ ల ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు జిల్లాలో శాలి గౌరారం, తిప్పర్తి, ఛండూ ర్, చింత పల్లి, దామరచర్ల ఐదు చోట్ల పి.హెచ్.సి.లలో మహిళా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
MOST READ :
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
- Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
- Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!
స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు,మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని,ముందుగా ఆశా లు, ఏ.ఎన్.ఎం.లు, అంగన్ వాడి టీచర్ లు ,వర్కర్ లు ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా మహిళల్లో రక్త హీనత సమస్య ఎక్కువ వుందని,రక్త హీనత వుంటే నీరసం,ఆయాసం వుంటుందని,అనీమియా 12 కంటే ఎక్కువగా ఉండేలా మంచి పోషక ఆహారం తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డా.కొండల్ రావు,జడ్.పి.టి.సి రనీల ,ఎం.పి.టి.సి.జోగు సైదమ్మ,తహశీల్దార్ పాల్ సింగ్,ఎం.పి.డి. ఓ రేఖల లక్ష్మయ్య, పి.హెచ్.సి.వైద్య అధికారి డా.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.









