గుత్తాను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు
గుత్తాను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్
మిర్యాలగూడ , మన సాక్షి :
తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు.
శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయం అంటూ సామాజిక సేవ ముసుగులో మానవత్వ ఆత్మీయ బంధాలు దెబ్బతీసే ప్రక్రియ మంచిది కాదని ప్రజల్లో ఒకరికి ఒకరికి ప్రేమానురాగాలు ఉండాలని, రాజకీయాలు మరి దిగజారొద్దని అనే ఉద్దేశంతో ఇటీవల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తావించారన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీలోని కొందరు స్థాయి మరచి విమర్శించడం పట్ల త్రీవ అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ సాధనలో వారి కృషి మారలేనిదన్నారు. తెలంగాణ సాధనలో పార్లమెంటులో, బయట ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని తన వంతు పాత్ర వహించారని అన్నారు.
ALSO READ : Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆంధ్ర ఎంపీలు గగ్గోలు పెట్టి బిల్లుకు అడ్డుపడి పేపర్ స్ప్రే ప్రయోగించినప్పుడు అస్వస్థకు గురై బాధపడ్డ విషయం తెలంగాణ సమాజానికి తెలుసు అన్నారు.
రాజకీయాల్లో గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చట్టసభలో ఎదిగిన విధంగా రాజకీయాలు అంటే ప్రజల శ్రేయస్సు కొరకు ఉండాలి మానవత్వ ఆత్మీయ బంధాలు రాజకీయాలు విలువలతో కూడిన విధంగా ఉండాలని ఉద్దేశంతో వారి ఆవేదన తప్ప మరొకటి లేదన్నారు.
ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
విమర్శకులు తప్పుడు మార్గాలు అన్వేషిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారితోపాటు పట్టణ బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు కర్నె గోవింద్ రెడ్డి, మన్నెం లింగారెడ్డి పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.









