Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

హైదరాబాద్, మన సాక్షి :

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అంతా సిద్ధం చేసింది. ఈనెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించిన విషయం విధితమే. 15వ తేదీన నిర్వహించిన టెట్ పరీక్షలో పేపర్ -1 కు 2.26 లక్షలు, పేపర్ – 2 కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఈనెల 27వ తేదీన ఫలితాలను వెల్లడించేందుకు ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారని ఎన్ సీ ఈ ఆర్ టి వర్గాలు తెలిపాయి.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

సి టి ఈ టి ఫలితాలు విడుదల :

ఆగస్టు 20వ తేదీన నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సిటీ ఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈ ఫలితాల కోసం వెబ్ సైట్ https//ctet.nic.in ను సంప్రదించవచ్చని సి బి ఎస్ సి పేర్కొన్నది.

ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు :

వైద్య విధాన పరిషత్ లో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు గాను ఈనెల 27వ తేదీన నిర్వహించే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వెబ్ ఆప్షన్లు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ కోరింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

మరిన్ని వార్తలు