Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణ

WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఓకే ఫోన్ లో రెండు ఖాతాలు..!

WhatsApp | వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ఓకే ఫోన్ లో రెండు ఖాతాలు..!

మన సాక్షి , ఇంటర్నెట్ :

వాట్సాప్ రోజురోజుకు కొత్త ఫీచర్లతో యూజర్స్ ని ఆకట్టుకుంటుంది. కొత్త కొత్త ఫీచర్ల ద్వారా యూజర్స్ ని వేరే వైపు వెళ్లకుండా చేస్తుంది. కొత్తగా వాట్సప్ తీసుకొస్తున్న ఫీచర్ వల్ల రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ ఖాతాలు ఒకే ఫోన్లో వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లు రెండు సిమ్లతో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్, పర్సనల్ ఫోన్ నెంబర్లు రెండు వినియోగిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రముఖ వాట్సాప్ యాప్ తీపి కబురు అందించింది. వాట్సాప్ అనునిత్యం తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క ఫోన్ నెంబర్ పైనే ఇప్పటివరకు వాట్సాప్ సేవలు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

ALSO READ : Terrible incident in Tamil Nadu : తమిళనాడులో ఘోర దుర్ఘటన

రెండో నెంబర్ పై వాట్సాప్ వినియోగించుకోవాలంటే మొదటి నెంబర్ వాట్సాప్ ఖాతా నుంచి లాగౌట్ కావాల్సి ఉండేది. కానీ కొత్తగా వాట్సాప్ సంస్థ తీసుకొస్తున్న ఫీచర్ తో రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సప్ ఖాతాలను ఒకే ఫోన్లో వినియోగించుకునే అవకాశం ఉంది. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా సీఈఓ తెలిపారు. ఇంతకుముందు రెండు వాట్సాప్ ఖాతాలు వాడాలంటే క్లోన్ యాప్ లేదా ఫేక్ యాప్ లు వాడేవారు.

వాట్సాప్ తాజాగా తీసుకురానున్న ఫీచర్ తో క్లోన్ యాప్ లు ఫేక్ యాప్ లు వాడాల్సిన అవసరం లేదు. ఒకే ఫోన్లో రెండు సిమ్ నెంబర్ లపై వేరు వేరు వాట్సాప్ ఖాతాలు నిర్వహించుకోవచ్చును. ఇటీవల చాలామంది రెండు వాట్సప్ లు రెండు సిమ్ లు వాడుతున్నారు. కుటుంబ అవసరాలకు ఒక వాట్సాప్, బిజినెస్ ప్రొఫైల్ కు అవసరాలకు మరో వాట్సప్ వాడుతున్నారు. అందుకని క్లోన్ యాప్ లను కాకుండా సరికొత్తగా రెండు వాట్సాప్ లు వినియోగించే విధంగా వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది.

ఇలా…

వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపున పై భాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేసి అందులో సెట్టింగ్స్ లో క్లిక్ చేయాలి. అకౌంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. యాడ్ అకౌంట్ పై క్లిక్ చేసి వచ్చే నిబంధనలను సరి చేస్తే రెండో వాట్సప్ కూడా లభిస్తుంది. వాట్సాప్ లో కుడి వైపున పై భాగంలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి కావలసినప్పుడు రెండు ఖాతాల మధ్య స్విచ్ కావచ్చును.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!

మరిన్ని వార్తలు