Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు జైలుకే..!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు జైలుకే..!

బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి,

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి ముఖ్యఅనుచారులు బురరి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి లు ఎన్నికల తర్వాత జైలుకు వెళ్లాల్సిందేనని బిఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి హెచ్చరించారు.

గురువారం ఎన్నారై నాగేందర్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పిల్లిగుట్ట భూములను. అసైన్డ్ భూములను. దళిత భూములను .కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సాక్షాలన్నీ తన వద్ద ఉన్నాయని ఎన్నికల తర్వాత వీటిని కోర్టులో సబ్మిట్ చేసి న్యాయపోరాటం చేస్తామని కోర్టు ద్వారా వారు జైలుకు వెళ్లే విధంగా చేస్తామన్నారు.

తన వెంట రౌడీలు తిరుగుతున్నారని ఆరోపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల తర్వాత ఎవరు వెంట రౌడీలు ఉన్నారో ఎవరి వైపు న్యాయం ఉందో తెలుస్తుంది అన్నారు. తాను ముఖ్యమంత్రి సభ పెట్టిన స్థలంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ పెట్టిన పదివేల మంది కూడా రాలేదని ,తాను నిర్వహించిన సభలో లక్ష మంది వరకు వచ్చారని ,ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ప్రజలకు ఉన్న ఆదర తెలుస్తుందని, కెసిఆర్ సభకు వచ్చిన జనమే తన గెలుపుకు నాంది అని అన్నారు.

లక్షల రూపాయలు పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకులు కోన్నంత మాత్రాన నష్టం ఏమి లేదని ప్రజలంతా తనవైపే ఉన్నారని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిన సభలో అమ్ముడుపోయిన నాయకుల సంగతి బయటపడింది అని ఆఖరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు