Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : ఎంపీ గా నా కుమారుడు పోటీకి సిద్దం..!

Nalgonda : ఎంపీ గా నా కుమారుడు పోటీకి సిద్దం..!
నల్లగొండ , మన సాక్షి :
నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ లేదా భువనగిరి పార్లమెంట్ నుండి నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారు అని తెలిపారు.

తెలంగాణలో 4 జిల్లాలో మాత్రమే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. మిగతా జిల్లాలలో మిక్సుడ్ ఫలితాలు వచ్చాయి అన్నారు.  హైదరాబాద్, మెదక్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యం కనిపించింది అన్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కలలో కూడా అనుకోలేదు అని తెలిపారు.

ALSO READ : Gas cylinder : తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూ. 500 లకే.. ఆ రోజు నుంచే అమలు..!

ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉండాలని ప్రజలంతా అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఫలితం తారుమారైంది అన్నారు.  నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలి. నా వంతుగా ప్రాజెక్టులపై సూచనలు, సలహాలు అందించాను.కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రోటోకాల్ ను పకడ్బందీగా అమలు చేయాలి అని కోరారు.

కాంగ్రెస్ 6గ్యారంటి లు ఇప్పట్లో అమలు సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సృష్టించిన ఆస్తుల మీద స్వేదపత్రం విడుదల చేస్తుంది. పార్లమెంటు పై పొగ బాంబ్ దాడి భద్రత లోపాలలను స్పష్టంగా చూపిస్తుంది . ప్రభుత్వాలు రాష్ట్ర భవిషత్తు గురించి, అభివృద్ధి కోసం పని చేయాలి .అంతేకాని పట్టుదలకు పోయి చతికలపడొద్దు.

ALSO READ : Telangana : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..!

ఆరోపణలు లేని ప్రభుత్వాలు దేశంలో లేవు. అలాగే బి ఆర్ ఎస్ ప్రభుత్వం పై కూడా ఆరోపణలు చేస్తున్నారు . ఏ ప్రభుత్వం అయిన హుందాతనంగా వ్యవహరించాలి అని కోరారు.

మరిన్ని వార్తలు