Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్లగొండలో సెపక్ తక్రా అంతర్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం..!

Nalgonda : నల్లగొండలో సెపక్ తక్రా అంతర్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం..!

వరల్డ్ హిందూ లైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు

నల్లగొండ. మన సాక్షి:

ఎన్ జి స్టేడియంలో తెలంగాణ వరల్డ్ హిందూ లైన్స్ ఆధ్వర్యంలో అంతర్ జిల్లా జూనియర్ సబ్ జూనియర్ సపక్ తక్రా క్రీడలు శనివారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడోత్సవాలను వరల్డ్ హిందూ లైన్స్ వ్యవస్థాపకులు, బిజెపి జాతీయ ఓబిసి సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్ ప్రారంభించారు.. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. 250 కి పైగా సెపక్ తక్రా క్రీడాకారులు వచ్చారు. జూనియర్ సబ్ జూనియర్

సెపక్ తక్రా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరిక సురేష్ మీడియాతో మాట్లాడుతూ కెలో ఇండియా, కెల్లో తెలంగాణ జితో నల్గొండ నల్గొండ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతకి చదువుతోపాటు క్రీడల్లో కూడా పోటీ తత్వం పెంచాలని లక్ష్యంతోని మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు, వారి సూచనలపై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.

ALSO READ : Power plant : యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదు.. డిప్యూటీ సీఎం బట్టి

క్రికెట్ తో పాటు ఇతర ఆటలు ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ ఎంపీ రాజ్యసభ మెంబర్ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కి లక్ష్మణ్ గారు కూడా ప్రోత్సహికరం ఇచ్చారని అన్నారు. ఇన్ని టీములు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అని, క్రీడలతో పాటు మేము హెల్త్ క్యాంపులు మరియు అన్నదాన కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా కరుణాకర్ రెడ్డి, ఎస్ అర్ ప్రేమ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డీ వైఫ్ ప్రెసిడెంట్, జితేందర్ నాథ్, ఉపేంద్ర, మల్లేష్, జగన్నాతా స్వామి పాల్గొన్నారు

మరిన్ని వార్తలు