Power plant : యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదు.. డిప్యూటీ సీఎం బట్టి

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర మంత్రుల బృందం మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలోని పవర్‌ ప్లాంట్‌ను సందర్శించింది.

Power plant : యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనుల పట్ల నిర్లక్ష్యం, వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదు.. డిప్యూటీ సీఎం బట్టి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :

యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర మంత్రుల బృందం మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలోని పవర్‌ ప్లాంట్‌ను సందర్శించింది. బేగంపేట నుంచి హెలికాప్టర్లో విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, ఆర్.అండ్.బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు చేరుకున్నారు.

వీరికి సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్‌లో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ గెస్ట్ హౌస్‌లో ఉన్నతధికారులతో ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.

పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.