Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ప్రజావాణి ఆర్జీదారులతో ఆప్యాయంగా పలకరింపు.. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు..!

Nalgonda : ప్రజావాణి ఆర్జీదారులతో ఆప్యాయంగా పలకరింపు.. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు..!

నల్లగొండ, మనసాక్షి:

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నార. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఆర్జీలను స్వీకరించారు.

ఆర్జీల స్వీకరణ అనంతరం ఆమె జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని సూచించారు . దానివల్ల దరఖాస్తుదారులకు మేలు కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన ఆర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

జిల్లా స్థాయితో పాటు, కిందిస్థాయి అధికారులు సైతం ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు. కొన్ని ఫిర్యాదుల పరిష్కారం లో భాగంగా జిల్లా అధికారులను తన దగ్గరకు పిలిపించుకొని వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవిన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి ,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ALSO READ : BIG BREAKING : ముగ్గురు కొడుకులకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు