Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Fertilizer : ఎరువులు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు..!

Fertilizer : ఎరువులు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు..!

ఏ డి ఏ రామారావు నాయక్

శాలిగౌరారం, మనసాక్షి:

ఎరువుల , విత్తనాల కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయం శాఖ ఏ డి ఏ రామారావు నాయక్ హెచ్చరించారు. గురువారం శాలిగౌరారం లోని పలు ఎరువుల షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రామారావు నాయక్ మాట్లాడుతూ షాపు యజమానులు ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టాలన్నారు. నిబంధనలు పాటించి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలన్నారు. కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా రషీదులు తీసుకోవాలన్నారు. వ్యాపారులు క్రమం తప్పకుండ లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి సౌమ్య శృతి,ఏ ఈ ఓ లు శ్రవణ్ కుమార్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు