Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Chinthapally : మరో షిరిడిగా చింతపల్లి బాబా ఆలయం..!

Chinthapally : మరో షిరిడిగా చింతపల్లి బాబా ఆలయం..!

ప్రతి వ్యక్తి జీవితంలో దైవచింతన ఎంతో ముఖ్యం…. మంత్రి కోమటిరెడ్డి.

చింతపల్లి, మన సాక్షి.

దైవచింతలతో ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మాత్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చింతపల్లి మండలం కేంద్రంలోని స్థానిక సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటే ధనంజయ, ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదరంగా ఆహ్వానం పలికి వేద పండితులచే ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో ఆహ్లాదమైన వాతావరణంలో చింతపల్లి మండల కేంద్రంలో మరో శిరిడి దేవాలయంగా వెలుగొందడం మన అందరికీ గర్వకారణంగా ఉందన్నారు.

మానవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు వచ్చి ఇలాంటి దైవకార్యాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అది కొందరికి అదృష్టంగా దక్కుతుందన్నారు. ఈ దేవాలయం మునుముందు ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ దేవాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మానవసేవయే మాధవ సేవ అంటూ ప్రతి ఒక్క వ్యక్తి దైవ సంకల్పంతో ముందుకు వెళ్లాలన్నారు.

దైవ సంకల్పం లేనిదే ఏ వ్యక్తి ముందుకు వెళ్లడన్నారు. సాయిబాబా గుడి చైర్మన్ మంచి కంటే ధనంజయ మున్ముందు మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారని వారికి అన్ని విధాలుగా నేను ఎల్లవేళలా వారి వెనకాల ఉంటా అన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే లేనావత్ బాలు నాయక్, ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ కాంగ్రెస్ వైయస్ ఎంపీపీ యాచారం యాదగిరి గౌడ్,చింతపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, డిసిసి ఉపాధ్యక్షులు దొంతం సంజీవరెడ్డి ఎరుకల వెంకటయ్య గౌడ్ గడ్డం పురుషోత్తం రెడ్డి ముచ్చర్ల ఎండి సలీం యాదగిరి పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, దొంత వెంకట నరసింహారెడ్డి, కాయ తిజ్జితేందర్ రెడ్డి దాసరి శ్రీనివాస్ యాదవ్ కాసారం శ్రీనివాస్, మునుకుంట్ల శేఖర్ గుండ్లపల్లి నర్సిరెడ్డి పద్మపూల్ సింగ్ నాయక్ గౌడ్,

ఎలిమినేటి నరసింహ, ఎల్లంకి కిషన్, వాంకుడోత్ సక్రు నాయక్, మద్దెల కృష్ణ గౌడ్, ఓ బి సి సెల్ నాయకులు మడి గ మల్లేష్ యాదవ్, సదానందం, ఎల్లంకి కిషన్, గోవింద గిరి, బొలవోని జంగయ్య గౌడ్, ఉప్పు శ్రీశైలం, కొప్పుల జంగయ్య గౌడ్, వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు