Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

BREAKING : రేవంత్ తో కేకే భేటీ.. చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని కేకే ప్రకటన..!

BREAKING : రేవంత్ తో కేకే భేటీ.. చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని కేకే ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు , ఆ పార్టీ సెక్రటరీ జనరల్ శుక్రవారం భేటీ అయ్యారు. కేకే నిన్న బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పింది తెలిసిన విషయమే. కాగా రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. రేపు కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముందుగా కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఆమె కంటే ముందే రేవంత్ రెడ్డి తో కేకే భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

ఇదిలా ఉండగా కేకే.. తనకు సొంత ఇల్లు లాంటిదని కాంగ్రెస్ పార్టీ, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేస్తారని, తను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరుతానని స్పష్టం చేశారు. 53 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశానని.. బీఆర్ఎస్ లో తను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమే అని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ లో చేరానని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు.

మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికైనట్లు పేర్కొన్నారు. తాను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్ పార్టీలోనే ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నాను అని కేకే పేర్కొన్నారు.

బీఆర్ఎస్ కి ఇంకా రాజీనామా చేయలేదని, తన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు తాను ఆ పార్టీలో చేరట్లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరే తేదీ ఖరారు అయిన తర్వాత తానే చెబుతానని తెలిపారు.

ALSO READ : KTR : కారు దిగుతున్న నేతలు.. వారిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు