Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..!

BIG BREAKING : కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..!

హైదరాబాద్ :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన చేసిన ఆరోపణలకు ఓ కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలను వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హనుమకొండ పోలీసులు ఆ కేసును హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కాగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ALSO READ : KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!

ఇదీ కారణం..

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవనంలో జరిగిన సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడిన సమయంలో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బిజెపి ప్రభుత్వమా..? అని అర్థం కావడం లేదంటారు. రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కొడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కేసు నమోదు కావడానికి ఆయన వ్యాఖ్యలే కారణం.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

మరిన్ని వార్తలు