BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!
BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!
సికింద్రాబాద్, మన సాక్షి :
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే , సాయన్న కూతురు లాస్య నందిత ఇటీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆస్థానంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనున్నది. కాగా కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వు స్థానానికి ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నారాయణ్ శ్రీ గణేష్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. శనివారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆమోదించడంతో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శ్రీ గణేష్ పేరును ప్రకటించారు.
శ్రీ గణేష్ గత ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేయగా 41, 88 8 ఓట్లు సాధించి రెండవ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గద్దర్ కూతురు ఏన్నెల కు 20వేల ఓట్లు వచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ కు టికెట్ కేటాయించింది.
ALSO READ :
- Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!
- Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!
- IPL : ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సునామి.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ హెచ్..!
- Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!









