Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుతెలంగాణ

IPL : ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సునామి.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ హెచ్..!

IPL : ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ సునామి.. సరికొత్త రికార్డు సృష్టించిన ఎస్ ఆర్ హెచ్..!

హైదరాబాద్ , మన సాక్షి :

ఐపిఎల్ క్రికెట్ లో ఎస్ ఆర్ హెచ్ టీం సునామి సృష్టించింది. బుధవారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఎస్సారెస్ వర్సెస్ ముంబై టీం మధ్య మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఎస్ ఆర్ హెచ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సునామి సృష్టించింది.

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో 2013లో ఆర్సిబి వర్సెస్ పంజాబ్ టీం తో ఆడిన సమయంలో ఆర్సిబి 263 పరుగులతో రికార్డు సృష్టించగా ప్రస్తుతం ఆర్సీబీ రికార్డును ఎస్ఆర్ హెచ్ బ్రేక్ చేసింది. ముంబై ఇండియా ముంగిట భారీ లక్ష్యం ఉంది.

కిటకిటలాడిన ఉప్పల్ స్టేడియం :

ఐపీఎల్ మ్యాచ్ బుధవారం ఎస్సారెస్ – ముంబై ఇండియా టీం కొనసాగుతుండగా ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానుల తో కిటకిటలాడింది. క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అభిమానుల సౌకర్యార్థం కోసం తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన 60 బస్సులను ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా బస్సులను ఉప్పల్ స్టేడియం వైపు తీసుకెళ్లగా మ్యాచ్ అయ్యాక కూడా వివిధ ప్రాంతాలకు ఉప్పల్ స్టేడియం నుంచి ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా వేసింది. దాంతో అభిమానులు ఉప్పల్ స్టేడియం కు భారీగా చేరారు.

ALSO READ : KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

మరిన్ని వార్తలు