Nalgonda : గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్టు..!
Nalgonda : గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్టు..!
నల్లగొండ, మనసాక్షి:
అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు . గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన తెడ్ల సాయికుమార్ , నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల పవన్, అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన బోడ వినోద్ కుమార్ . అక్కనపల్లి గ్రామానికి చెందిన షేక్ జావిద్. చింతకుంట్ల గణేష్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెందిన కిరణ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెందిన ఆశీస్ లు గురువారం సాయంత్రం వీరి వద్ద ఉన్న గంజాయిని పంచుకొని అవసరం ఉన్న వారికి అమ్మడం కోసం ప్లాన్ చేస్తున్నారు.
సమాచారం తెలుసుకొని నార్కట్పల్లి ఎస్సైలు అంతిరెడ్డి సురేష్ వారి సిబ్బందితో సహా వెళ్లి నార్కట్పల్లి శివారులో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా వీరు సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం అందరూ తలా ఎనిమిది వేల రూపాయలు పోగుచేసుకొని మొత్తం 40 వేల రూపాయలతో సాయికుమార్ . పవన్ లు 10 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వెళ్లి అక్కడ కిరణ్ ఆశీస్ ల వద్ద మూడు కేజీల గంజాయిని కొనుగోలు చేసుకుని వచ్చి నారని తెలిపారు.
ALSO READ :
- Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!
- WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!
- Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!
- Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!
అట్టి గంజాయిని నార్కట్పల్లి మండలంలోని అక్కినపల్లి అమ్మనబోలు ఎల్లారెడ్డిగూడెం పిట్టంపల్లి పామనగుండ్ల గ్రామాల్లో కొంతమందికి అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కొంతమందికి చిన్న చిన్న ప్యాకెట్లను తయారు చేసి అమ్మినట్లు తెలిపారు. అమ్మగా మిగిలిన గంజాయిని ఐదుగురు పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు .
నేరస్తుల నుండి ఐదు గంజాయి ప్యాకెట్లు ఐదు సెల్ ఫోన్లు కుక్క పార్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును చేదించిన నార్కట్పల్లి సీఐ నాగరాజు ఎస్సైలు అంతిరెడ్డి సురేష్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.
ALSO READ :
- Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!
- Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!
- Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!









