Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజాతీయంరాజకీయం

BIG BREAKING : నిన్న బెయిల్.. నేడు స్టే, జైలులోనే కేజ్రీవాల్..!

BIG BREAKING : నిన్న బెయిల్.. నేడు స్టే, జైలులోనే కేజ్రీవాల్..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బెయిల్ దొరికిందని సంతోషపడిన సీఎం కేజ్రీవాల్ కి నిరాశ కలిగింది. నిన్న (గురువారం) రోజు రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ జారీ చేసింది. దాంతో శుక్రవారం ఆయన విడుదల అయ్యే అవకాశాలు ఉండేది. కానీ అధికారులు బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బయట ఉంటే సాక్షాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు.

దాంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దాంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి.

లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్న కేసులు పలుమార్లు కోర్టుకు వెళ్లి తనకు బెయిల్ ఇవ్వాలని కోరడంతో గురువారం రౌస్ ఎవెన్యూ కోర్టు లక్ష రూపాయల పూచికత్తుతో కేజ్రీవాల్
బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈడీ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ బెయిల్ రద్దు చేయాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ పై స్టే విధించింది. దాంతో ఆప్ కార్యకర్తల్లో, కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల్ల, నిరాశ నెలకొన్నది.

ALSO READ :

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

Ys Jagan : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం..!

Pds Rice : వంద క్వింటాల రేషన్ బియ్యం డంప్ పట్టివేత..

 

మరిన్ని వార్తలు