Pds Rice : వంద క్వింటాల రేషన్ బియ్యం డంప్ పట్టివేత..

పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకోవడం జరిగింది. 

Pds Rice : వంద క్వింటాల రేషన్ బియ్యం డంప్ పట్టివేత..!

పెద్దపల్లి ధర్మారం, మనసాక్షి :

పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకోవడం జరిగింది.  గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నరసింహులపల్లి గ్రామం ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియా నందు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న ఓపెన్ ఏరియాలో దాదాపు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం డంప్ ను గుర్తించామని, ఈ బియ్యాన్ని ఎవరు క్లెయిమ్ చేయడం లేదని, పంచనామా నిర్వహించి జిల్లా కలెక్టర్ తదుపరి ఆదేశాల వరకు ఎం.ఎల్.ఎస్ పాయింట్ వద్ద ఈ బియ్యాన్ని భద్రపరచడం జరుగుతుందని అన్నారు.

ALSO READ :

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

Nalgonda : ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా..? ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్..!