Rmp : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి RMPలు పాలాభిషేకం.!
Rmp : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి RMPలు పాలాభిషేకం.!
సూర్యాపేట, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను పీఎంపీలను గుర్తించి వారికి ఉచిత శిక్షణ ఇస్తామని ప్రకటించడం హర్షనీయమని ఆర్.ఎం.పి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీ నరసయ్య అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి , మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ . కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్ఎంపీలకు పీఎంపీలకు ఉచిత శిక్షణ ఇవ్వడం తో పాటు సర్టిఫికెట్లను కూడా అందజేయాలని కోరారు. మార్ముల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎన్నలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలను పీఎంపీలను ఆదుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఎంపీలు పీఎంపీలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేలా కార్యచరణ రూపొందించాలని వేడుకున్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆర్ఎంపీలను, పీఎంపీలను గుర్తించి అభివృద్ధికి సహకరించారని తిరిగి మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆర్ఎంపీలను గుర్తించిందన్నారు.
కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి రాజేందర్ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్.కె రెహమతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ డాంగ్ డేగౌడ్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ జెర్రిపోతుల లక్ష్మణ్ గౌడ్,మీడియా కోఆర్డినేటర్ గోకంటి రాజబాబు రెడ్డి, సూర్యాపేట జోనల్ అధ్యక్షుడు కుమ్మరి వెంకన్న తుంగతుర్తి జోనల్ అధ్యక్షుడు ఎస్.కె నాగుల్ మీరా కోదాడ డివిజన్ కన్వీనర్ నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుడు భువనగిరి లక్ష్మణ్ నాయుడు హుజుర్నగర్ డివిజన్ కన్వీనర్ మరికంటి శ్రీనివాస్ వివిధ మండల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు









