TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : పచ్చని చెట్లు బొగ్గు పాలు.. యదేచ్ఛగా బొగ్గు బట్టీల నిర్వహణ..!

Nalgonda : పచ్చని చెట్లు బొగ్గు పాలు.. యదేచ్ఛగా బొగ్గు బట్టీల నిర్వహణ..!

బొగ్గుబట్టీలకు తరలుతున్న కలప

నిద్రవస్తలో ఫారెస్ట్ అధికారులు

చింతపల్లి, మన సాక్షి :

రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవాన్ని చేపట్టింది. కోట్ల
కొద్దీ మొక్కలు నాటిస్తూ వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ మరోవైపు అక్రమార్కుల కక్కుర్తిపడి పర్యావరణాన్ని నల్లగా మారుస్తున్నారు. బాగా ఎదిగిన వేలాది చెట్లు బొగ్గు’ పాలవుతున్నాయి.

పొలాలు, రహదారుల వెంట ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తూ వాటి కలపను బొగ్గుగా మార్చి అమ్ముకుని సోమ్ము కుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి నుంచే ఏకంగా నెలనెలా వెయ్యి లారీలకు పైగా బొగ్గు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు రవాణా అవుతోంది.

నల్లగొండ జిల్లా పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వేలచెట్లను నరికేస్తున్నారనే ఆందోళన నెలకొంది. దీంతో పర్యావరణానికి విఘాతం కలగడంతోపాటు కలపను కాల్చేబొగ్గు బట్టీల కారణంగా వెలువడే పొగ, విష వాయువులతో భారీగా కాలుష్యం తలెత్తుతోంది.

వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలంలో కుర్మెడు, నెల్వలపల్లి, చింతపల్లి, వింజమూరు, ఉమ్మాపురం, అనాజిపురం తదితర గ్రామాలలో విచ్చలవిడిగా బొగ్గు బట్టీలు కాలుస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

నిబంధనలను తుంగలో తొక్కి కాలుష్యం విడుదలతున్న బొగ్గుబట్టిల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండలం లోని పలు గ్రామాలలో చెట్ల నరికివేత కొనసాగుతోంది బొగ్గు బట్టీల కాంట్రాక్టర్లు కలపను కాల్చి బొగ్గుగా మార్చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.వందల ఏళ్ల వయసున్నా చెట్లు కూడా కాంట్రాక్టర్ల గొడ్డలి వెటుకు నేలకూలుతున్నాయి.

మండలంలోని పలు గ్రామాల్లో అటవీ భూముల్లో పొలాలు రహదారుల వెంట ఉన్న చెట్లను విచ్చలవిడిగా నరికి కలపను బొగ్గుబట్టిల్లో కాల్చి సొమ్ము చేసుకుంటున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి బొగ్గుబట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ALSO READ : 

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

District collector : రుణమాఫీ ఫిర్యాదుల విభాగం మండలాల్లో నిరంతరం నడిపించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు