Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని అరికట్టాలి..!

Miryalaguda : నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని అరికట్టాలి..!

మిర్యాలగూడలో విత్తనాభివృద్ధి సంస్థను సందర్శించిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్

మిర్యాలగూడ, మన సాక్షి :

నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని అరికట్టే బాధ్యత అధికారులదే అని కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుకేత అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మరియు గిడ్డంగులను సందర్శించారు.

ఈ కార్యక్రమమును ఉద్దేశించి సుకెత అన్వేష్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ రైతుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఏ విత్తనములు వాడాలి ఏ ఎరువులు వాడాలి అనే విషయాన్ని వారితో చర్చించి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది.

మార్కెట్లోకి వస్తున్నటువంటి నకిలీ విత్తనాలని పసిగట్టి వాటిని నిర్ములించాలని అధికారులను సూచించారు. రైతు ఈ దేశానికి వెన్నుముక లాంటి వ్యక్తి రైతు మంచిగా ఉంటే దేశం పచ్చగా ఉంటుందని ఆయన రైతుల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గిడ్డంగుల సంస్థలను ఎరువుల సంస్థలను పర్యవేక్షించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షులు కెతావత్ శంకర్ నాయక్, నల్గొండ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిళ్ల శ్రీనివాస్, తమ్ముడబోయిన అర్జున్ , తలకొప్పుల సైదులు , దామరచర్ల మండల అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, కౌన్సిలర్లు14 వ వార్డు కౌన్సిలర్ గంధం రామకృష్ణ , 20 వ వార్డు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి , బత్తుల సాయి ప్రసన్న, సంబంధిత ఆఫీసర్లు కృష్ణవేణి, సంధ్యారాణి, ఆదినారాయణ రెడ్డి, వినయ్, నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?

Srisailam : శ్రీశైలంకు పెరిగిన భారీ వరద తాకిడి.. మరో రెండు గేట్లు ఓపెన్.. సాగర్ వైపు ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. Latest Update

మరిన్ని వార్తలు