పంటచేలలో గంజాయి సాగు చేస్తే జైలుకే.. పరిశీలించిన సీఐ..!
పంటచేలలో గంజాయి సాగు చేస్తే జైలుకే.. పరిశీలించిన సీఐ..!
కంగ్టి, మన సాక్షి :
పంట చేలలో గంజాయి సాగు చేస్తే జైలుకు పంపిస్తామని కంగ్టి సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కంగ్టి మండలంలోని చౌకన్ పల్లి, రామ్ సింగ్ తండా, జిర్గి తాండ, మీట్టు తాండ, బోర్గి, సర్దార్ తాండ, హట్య తాండ, ముకుంద తాండ,వాచు తాండ, శివారులోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, గంజాయి పట్ల తనిఖీ చేశారు.
సీఐ మాట్లాడుతూ.. గంజాయి సాగు చేసినా, అమ్మినా నేరమని, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామన్నారు. పంట పొలాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్న వారి సమాచారం అందినచో వారికి రూ.2500 అందిస్తామని అలాగే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ నెంబర్లకు 8712656709, 872656734, 8712656760 సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్ కుమార్ , పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి
BREAKING NALGONDA : భూ తగాదాలలో కర్రలు, రాడ్లతో పరస్పర దాడులు.. 14 మందిపై కేసు..!
Miryalaguda : నకిలీ విత్తనాలను గుర్తించి వాటిని అరికట్టాలి..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!









