మిర్యాలగూడ : కమీషన్ ఆశ చూపి.. భారీ మోసం..!
మిర్యాలగూడ : కమీషన్ ఆశ చూపి.. భారీ మోసం..!
మిర్యాలగూడలో ఏపీకి చెందిన ఐదుగురి ముఠా అరెస్టు
మిర్యాలగూడ, మన సాక్షి,
కమిషన్ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ముఠాను మిర్యాలగూడ పోలీసులు పట్టుకున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరిపే స్వైపింగ్ మెషీన్( పీఓఎస్ యంత్రాలు) ల్లోని ఆప్షన్లను వాడుకుని పెట్రోల్ బంకు యజమానులకు టోకరా వేస్తున్నారు. వారిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
మిర్యాల గూడ డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపిన వివరాలిల ప్రకారం.. ఏపీలోని పబ్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన వేముల శ్రీనివాసరావు, నేల టూరి రవికుమార్, మలపతి శౌరీ, నర్సారావుపేట మండలం రావిపాడుకు చెందిన ఆనాల శివ, కారంపుడికి చెందిన కడితం సిద్ధార్దరెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.
ఇలా మోసం చేస్తారు :
ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలపై తిరుగుతూ పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ బంకులోకి వెళ్లి తమ బంధువు ఆస్పత్రిలో ఉన్నారని, అత్యవసరంగా నగదు కావాలని, తమ క్రెడిట్ కార్డు నుంచి నగదు డ్రా చేసి ఇస్తే కొంత కమీషన్ గా ఇస్తామని సాయం చేయమని చెప్పేవారు.
బంక్ నిర్వాహ కులు అంగీకరిస్తే తమ క్రెడిట్ కార్డు నుంచి రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు డ్రా చేసేవారు. ఈ క్రమంలో ముఠా సభ్యులు బంక్ ఆపరేటర్ ను మాటల్లో పెట్టి పీఓఎస్ యంత్రాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మెషీన్ లోని ‘వాయిడ్’ అనే ఆప్షన్ వాడి తాము చేసిన లావాదేవీని రద్దు చేసేవారు.
దీంతో డ్రా చేసిన సొమ్ము తిరిగి వారి క్రెడిట్ కార్డులో జమయ్యేది. అలాగే బంకు నిర్వాహకుల నుంచి నగదు కూడా తీసుకుని పరారయ్యేవారు.
ఏపీతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లా బంకుల్లో మోసం:
వేముల శ్రీనివాసరావు, ఆనాల శివ తొలుత నర్సారావుపేట, రావిపాడులోని బంకుల్లో ఈ తరహా మోసాలు చేశారు. ఇదే టెక్నిక్ తో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు పెట్రోల్ బంకుల్లోనూ మోసాలకు పాల్పడ్డారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వీరు అనుమానాస్పదంగా కనిపించ డంతో అడ్డుకున్న వేములపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.80లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్, క్రెడిట్ కా ర్దును స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Viral video : బైక్ పై వెళ్తూనే ఇదేం పాడు పని.. రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వైరల్ వీడియో)
Fack currency : జోరుగా నకిలీ నోట్లు చలామణి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా..!









