Tungabhadra : కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. దిగువకు ఫోటెత్తిన నీరు..!
Tungabhadra : కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. దిగువకు ఫోటెత్తిన నీరు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కర్ణాటకలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది. దాంతో డ్యామ్ నుంచి నీరు భారీగా పొట్టెత్తుతోంది.
వివరాల ప్రకారం.. తుంగభద్ర డ్యామ్ కు వరద తగ్గడంతో శనివారం అర్ధరాత్రి డ్యాం గేట్లను మూసివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో 19వ గేటు చైన్ తెగిపోయి మొత్తం ఊడిపోయింది. దాంతో నీరు ఆ గేటు ద్వారా కిందికి వెళ్ళిపోతుంది.
తుంగభద్ర ప్రాజెక్టు గేటు తెగిపోయి పడిపోవడంతో అధికారులు, పోలీసులు అంతా అక్కడికి అర్ధరాత్రి చేరుకున్నారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటకి వదిలిన తర్వాతనే గేటు పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రస్తుతం తుంగభద్ర నుంచి 33 గేట్ల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆదివారం ఉదయం మంత్రి శివరాజ్ సందర్శించారు.
ALSO READ :
Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!
Miryalaguda : మిర్యాలగూడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోజు వాహనదారులు అటువైపు వెళ్లొద్దు..!
TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)









