Suryapet : బోనమెత్తిన సూర్యాపేట..!
Suryapet : బోనమెత్తిన సూర్యాపేట..!
– ఊర ముత్యాలమ్మ ఆలయంలో ఘనంగా వేడుకలు
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ ఆలయంతో పాటు మార్కెట్లోని కోట మైసమ ఆలయం, తిరుమలనగర్‌లోని బేచిరాగ్ మాదారం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాల్లో బోనాల వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు ఉదయాన్నే తలంటూ స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి కొత్త కుండను పూజించి బోనం వండుకొని నెత్తిన పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి చీర సారె సమర్పించారు. అనంతరం దేవాలయం ఆవరణలో యాటలు, కోళ్ళను బలి ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ఊర ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయంతో పాటు ఆయా ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కూలైన్లలో సంయమానం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ, మున్సిపల్, పోలీసు శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకొని వేడుకలను విజయవంతం చేశారు. ఆయా ఆలయాల్లో రాష్ట్ర టూరీజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఊర ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు సారగండ్ల రాములు, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న, బేచిరాగ్ మాదారం ముత్యాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు మారం వెంకటరెడ్డిలతో పాటు ఆయా వార్డుల కౌన్సిలరు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ALSO READ :
SLBC : ఎస్ఎల్బీసి సొరంగం పూర్తి కి రూ.460 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్..!
Tungabhadra : కొట్టుకపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. దిగువకు ఫోటెత్తిన నీరు..!
Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!









