CPM : విష జ్వరాల బారిన ప్రజలు.. నివారణ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం..!
CPM : విష జ్వరాల బారిన ప్రజలు.. నివారణ చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం..!
సూర్యాపేట, మనసాక్షి :
అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్న వాటి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆరోపించారు.
శుక్రవారం మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ జరిగిన సిపిఎం పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాల మూలంగా ప్రజలుటైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి ఇంట్లోఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. అంటూ వ్యాధులు,విష జ్వరాలు ప్రబలకుండా ఉన్నందుకు అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
పి.హెచ్.సి సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని గ్రామాలలోవైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచారా వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జిల్లా పెళ్లి నరసింహారావు, దండ వెంకటరెడ్డి, వేల్పుల వెంకన్న, మేకనబోయిన శేఖర్, వీరబోయిన రవి, కొప్పుల రజిత, మేకన బోయిన సైదమ్మ,
చిన్నపంగా నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు అర్వపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
MIRYALAGUDA : 15వేల మంది విద్యార్థులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!









