అదృశ్యమైన తల్లి, కూతురు లభ్యం..!
అదృశ్యమైన తల్లి, కూతురు లభ్యం..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లారామసముద్రం మండలంలోని ఊలపాడు కు చెందిన తల్లి,కూతురు నౌజియా, షాపియా ల ఆచూకి ని కనుగొన్న పోలీసులు. శనివారం పోలిస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. నౌజియా వివరాలమేరకు పెద్దపంజాని మండలం గుండ్లపల్లెకు చెందిన అరవింద్ అనే యువకునితో సోషల్ మీడియా ద్వారా నౌజియా కు పరిచయం అయ్యాడు.
ఇది ప్రేమగా మారి గత ఆరు నెలలుగా సోషల్ మీడియా లో ఒకరికొకరు ఛాటింగ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 15 న నౌజియా వి. కోటలోని తన అక్కను చూడాలని ఉందని, భర్త ను కోరగా అతను నౌజియా ను రామసముద్రం నుండి వి. కోటకు వెళ్లే బస్సులో ఎక్కించి పంపాడు.
అయితే నౌజియా వి. కోట వెళ్లకుండా ములబాగల్ లో దిగి అప్పటికే ములబాగల్ చేరుకున్న ప్రియుడు అరవిద్ తో వెళ్ళింది.చిత్తూరు వెళ్లిన ఇద్దరూ అతని మిత్రుల సాయంతో పెళ్లిచేసుకున్నారు. నౌజియా కు వచ్చిన సెల్ ఫోన్ కాల్స్ ట్రాక్ చేసి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని నౌజియా ను తీసుకు వచ్చారు.
అయితే తాను తన ప్రియుని వద్దకే వెళతానని, భర్త, అమ్మతో వెళ్లనని అతనిని పిలిపించి అతనితో తనను పంపించాలని పోలీసులకు తెలిపింది.పోలీసులు అరవింద్ కోసం వెళ్లగా అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.
పోలీసుల నిబంధనల ప్రకారం మహిళను రాత్రి పూట స్టేషన్ లో ఉంచడం నిషేధం కావడంతో పోలీసులు నౌజియా ను రాయచోటి లోని వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









