Miryalaguda : శిధిలావస్థలో తడ్కమళ్ల ప్రాథమిక పాఠశాల.. తరగతి గదులు ఖాళీ చేయించిన అధికారులు..!
Miryalaguda : శిధిలావస్థలో తడ్కమళ్ల ప్రాథమిక పాఠశాల.. తరగతి గదులు ఖాళీ చేయించిన అధికారులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించారు. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేషగిరి శర్మ సందర్శించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిథిలావస్థలో ఉన్న నాలుగు తరగతి గదులను ఖాళీ చేయించి నిర్మాణంలో ఉన్న తరగతి గదులలో విద్యార్థులు కూర్చునే విధంగా చర్యలు తీసుకున్నారు.
పాఠశాల ప్రాంగణంలో వర్షపునీరు నిండి ఉండడాన్ని గమనించి గ్రామ పంచాయతీ సిబ్బందితో తొలగించాలని ఆదేశించారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శిధిలావస్థలో ఉండి పై కప్పులు బలహీనంగా ఉన్న పెచ్చులు ఊడుతున్న అటువంటి గదులలో విద్యార్థులను కూర్చోబెట్టకూడదని తెలిపారు.
వర్షాభావం వలన బలహీనంగా ఉన్న ప్రహరీ గోడల వద్ద, విద్యుత్ స్తంభాల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఆయనతో పాటు మండల విద్యాధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
LATEST UPDATE :
మిర్యాలగూడ : పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్.. ట్రేడింగ్ లైసెన్సులతో భారీ మోసం..!
NALGONDA : జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం.. ఫీల్డ్ అసిస్టెంట్, అధికారులపై చర్యలు..!
Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









