Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంతెలంగాణనల్గొండ

NALGONDA : జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం.. ఫీల్డ్ అసిస్టెంట్, అధికారులపై చర్యలు..!

NALGONDA : జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం.. ఫీల్డ్ అసిస్టెంట్, అధికారులపై చర్యలు..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. మొక్కలు నాటకపోయినా నాటినట్లుగా సమాచారం ఇవ్వడంతో ఆ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు అధికారులపై చర్యలకు జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం, మేడారం గ్రామంలో వనమహోత్సవం కింద మొక్కలు నాటకపోవడం, అంతేకాక ఇచ్చిన మొక్కల నిర్దేశాన్ని పూర్తి చేయకపోవడమే కాక తాను క్షేత్రస్థాయి పర్యటనలో మొక్కల గురించి విచారించగా తనకు తప్పుడు సమాచారం ఇచ్చారు.

అందుకు గాను మేడారం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఎం .శ్రీనివాస్ పై తగు చర్య తీసుకోవాలని డిఆర్డిఓ ను ఆదేశించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

తాను గురువారం పీఏ పల్లి మండలం, మేడారం గ్రామంలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాల పరిశీల నిమిత్తం వెళ్లడం జరిగిందని, ఆ సమయంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, ఎం శ్రీను, ఎం పి డి ఓ, ఏపీవో లు హాజరయ్యారు.

అయితే గ్రామపంచాయతీ చుట్టుపక్కల, పాఠశాలలో మొక్కలు నాటకపోవడం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమ లక్ష్యాన్ని సైతం పూర్తి చేయకపోవడం పై ఫీల్డ్ అసిస్టెంట్ ను వివరాలు కోరగా, ఫీల్డ్ అసిస్టెంట్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, అబదాలు చెప్పినట్లు నిర్ధారణ అయ్యింది.

విధుల పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు, ఏపీఓ పూర్తి నిర్లక్ష్యం వహించిన కారణంగా వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిఆర్డిఓ ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

LATEST UPDATE : 

BIG BREAKING : తెల్ల రేషన్ కార్డుదారులకు ఇక సన్న బియ్యం.. మంత్రి ఉత్తమ్ వెల్లడి..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!

Nalgonda : ఉదయ సముద్రం నుంచి అందరికీ సాగునీరు.. రైతులకు భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు