Nalgonda : ఉదయ సముద్రం నుంచి అందరికీ సాగునీరు.. రైతులకు భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్..!
Nalgonda : ఉదయ సముద్రం నుంచి అందరికీ సాగునీరు.. రైతులకు భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి :
త్వరలోనే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింది ఆయకట్టు రైతులందరికీ సాగునీరు వస్తుందనీ నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
తెలిపారు. ఉదయసముద్రం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ త్వరలోనే సాగునీరు వస్తుందని, అందువల్ల రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
గురువారం ఆయన ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సాగు నీరు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ ను అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే ఔట్ ఫాల్ రెగ్యులటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ ద్వారా ఉదయ సముద్రంలోకి నీరు వస్తుండగా, ఉదయసముద్రం నుండి డి-39, డి-40 ద్వారా ఆయకట్టు భూములకు కెనాల్ ద్వారా నీరు వెళ్ళటాన్ని కలెక్టర్ పరిశీలించారు.
డి-39 కింద 10 వేల ఎకరాలు, డి-40 కింద 27 వేల ఎకరాలు సాగు అవుతుండగా, నీటిమట్టం పెరిగిన తర్వాత కింది భాగంలో ఉన్న అన్ని చెరువులను, కుంటలను నింపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజక్ట్ లో సరిపోయినంత నీరు ఉన్నందున రైతులు ఎవరు తొందరపడి సాగునీటిని మళ్లించవద్దని కోరారు.
హై లెవెల్ కెనాల్ కింద మూసి రివర్ కింది భాగంలో ఉన్న డి -55 వరకు నీరు అందించే ప్రయత్నాన్ని చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉదయ సముద్రం కింద ఉన్న ఆయకట్టు రైతులు అందరికీ సాగునీరు వస్తుందని, అందువల్ల ఎవరు ఆందోళన చెందవద్దని, తొందరపడి నీటిని మళ్లించుకోవద్దని ఆయన పునరుద్ఘాటించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఈ ఈ లు జి .శ్రీనివాస్ రెడ్డి. సురేందర్ రావు, డి ఈ ఆనందరావు, ఏఈలు, లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









