Breaking Newsతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయంహైదరాబాద్

BREAKING : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు..!

BREAKING : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక లేరు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. జిట్ట బాలకృష్ణ రెడ్డి మృతి పట్ల నల్లగొండ జిల్లా ప్రజలు, అభిమానులు కన్నీరు పెడుతున్నారు.

1972 డిసెంబర్ 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా బొ?అమాయి పల్లి గ్రామంలో జిట్టా బాలకృష్ణారెడ్డి జన్మించారు. 1987లో బీబీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉన్నత విద్య, 1989లో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, 1993లో ఎల్బీనగర్ లోని డివిఎం డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన కీలకపాత్ర పోషించారు. టిఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో నిలచారు. ఫ్లోరైడ్ నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలను రక్షించేందుకు గ్రామాలలో వాటర్ ప్లాంట్లను నెలకొల్పారు. ఇప్పటికే ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమితో పొత్తులో భాగంగా భువనగిరి అసెంబ్లీ సీటు టిడిపికి కేటాయించడంతో ఆయన టిఆర్ఎస్ పార్టీని వీడారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు.

ఆ తర్వాత యువ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2022లో బిజెపిలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్ కు కూడా గురయ్యారు. ఇటీవల 2023 అక్టోబర్ 20న తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

LATEST UPDATE : 

Nirmal : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..!

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8లో.. సోనియా ఎవరో తెలుసా..!

Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..! 

మరిన్ని వార్తలు