Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిర్మల జిల్లావైద్యం

Nirmal : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..!

Nirmal : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..!

నిర్మల్ ,మన సాక్షి :

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు.
గురువారం భైంసా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని, సరిపడినన్ని బెడ్లు, మందులు, ఇతర వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

వైద్యులంతా తప్పనిసరిగా సమయపాలనను పాటించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి, నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు.

ఇన్ పేషెంట్, బయటి రోగుల విభాగం, మందుల గది, ఇంజక్షన్లు, టీకాల గదిని పరిశీలించి. ప్రసూతి, ఆరోగ్య శ్రీ విభాగాలకు సంబంధించిన అన్ని రకాల రిజిస్టర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో గల సౌకర్యాలు, అందిస్తున్న చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు కాశీనాథ్, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

అర్హత లేకుండా వైద్యం.. క్లినిక్ సీజ్..!

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!

Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు 8లో.. సోనియా ఎవరో తెలుసా..!

Cm Revanth Reddy : తుఫాన్ నష్ట బాధితులకు భారీ సహాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు