TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Apprenticeship : సింగరేణిలో అప్రెంటిషిప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..! 

Apprenticeship : సింగరేణిలో అప్రెంటిషిప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..! 

రామగిరి, (మన సాక్షి) :

ఐటిఐ శిక్షణ పొందిన యువతి యువకులు సింగరేణిలోని 11 ఏరియాలలో అప్రెంటిస్ చేసేందుకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు,మాజీ ఉద్యోగుల పిల్లలు, ప్రాజెక్ట్ ప్రభావిత, పునరావాస గ్రామాల యువతి యువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

2024-25 సంవత్సరానికి వివిధ ట్రేడ్ ల ఐటిఐ( ఎన్.సి.వి.టి) అభ్యర్థులకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఎం.ఎస్.డి.ఈ) రీజినల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్,ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఎం.ఎస్.డి.ఈ) హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్.ఏ.పి.ఎస్) వెబ్ పోర్టర్లో ముందుగా అభ్యర్థులు తమ వివరాలను పొందుపరచవలనని తెలిపారు.

అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ వెబ్ పోర్టల్ లో (www.apprenticeshipin-dia.org) లో తమ పేర్లను నమోదు చేసుకున్న తరువాత మాత్రమే కంపెనీ వెబ్ పోర్టల్ (www.scclmines.com/apprenticeship) లో ఆన్ లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, లేకపోతే దరఖాస్తు తిరస్కరించబడుతుందన్నారు.

సింగరేణి వెబ్ పోర్టల్ లో సెప్టెంబర్ 7 నుండి 23వ తేదీ వరకు తెరవబడుతుందని, ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును 09-09-2024 నుండి పోర్టర్ లో నమోదు చేసుకోవాలని, సెప్టెంబర్ 24వ తేదీలోపు ఏరియాలోని ఎం.వి.టి.సి కార్యాలయము నందు అందజేయాలన్నారు. ఇట్టి సదవకాశాన్ని అభ్యర్థులు సద్వియోగం చేసుకోవాలని జిఎం లు ఒక ప్రకటనలో తెలిపారు.

LATEST UPDATE : 

Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..! 

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!

మరిన్ని వార్తలు