తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

ManaSakshi Effect : మనసాక్షి కథనానికి స్పందన..! 

ManaSakshi Effect : మనసాక్షి కథనానికి స్పందన..! 

కంగ్టి, మన సాక్షి :

మన సాక్షి కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. దాంతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మన సాక్షి ముందుందని ప్రజల నుంచి అభినందనలు అందాయి. వివరాల ప్రకారం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని భోర్గి గ్రామంలో మురుగు కాలువలు శుభ్రం చేసిన కార్మికులు రోడ్డుపైనే చెత్తాచెదారం వదిలేశారు. దాంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయంపై” చెత్తను ఎత్తిపోయడం మారిచారు ” అనే కథనం గురువారం మన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది.

మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్, ఎంపిడిఓ సత్తయ్య, వెంటనే కార్యదర్శి అరుణ్ కుమార్ కు చెత్తను ట్రాక్టర్ ద్వారా ఎత్తిివేయించాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆ గ్రామ కార్యదర్శి కార్మికుల ద్వారా రోడ్డుపై ఉన్న మురుగు కాలువ చెత్తను తొలగించి శుభ్రం చేశారు. దాంతో గ్రామస్తులు మన సాక్షి రిపోర్టర్ కు అభినందనలు తెలిపారు.

LATEST UPDATE : 

Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!

TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

BRS : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఆ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు ఆదేశాలు..!

మరిన్ని వార్తలు