అమృత్ పథకం టెండర్లలో అవినీతి.. దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ..!
అమృత్ పథకం టెండర్లలో అవినీతి.. దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు.
అమృత్ టెండర్లలో అవినీతికి సంబంధించి కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ జీ (@mlkhattar) మరియు శ్రీ తోఖాన్ సాహు జీ (@tokhansahu_bjp)లకు నేను లేఖ రాశాను.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి తగిన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు కట్టబెట్టారు.

వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలపై నిజానిజాలు వెలికితీసేందుకు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. గత కొన్ని నెలలుగా కేటాయించిన ఈ టెండర్ల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిస్తోంది
అమృత్ పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలను దర్యాప్తు చేసి బహిర్గతం చేయాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను
తెలంగాణలో అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ప్రతి టెండర్‌ను పరిశీలించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే ఈ టెండర్లను రద్దు చేయాలని కోరారు.
ఈ టెండర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అవసరమైన అర్హతలు లేకపోయినా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపై విచారణ జరపాలి.
ఇవి కూడా చదవండి :
-
iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!
-
E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!
-
TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!










