జిల్లా వార్తలుBreaking Newsక్రైంతెలంగాణరాజకీయం
Miryalaguda : డీజే తో పుట్టినరోజు వేడుకలు.. కాంగ్రెస్ లీడర్ పై కేసు నమోదు..!
Miryalaguda : డీజే తో పుట్టినరోజు వేడుకలు.. కాంగ్రెస్ లీడర్ పై కేసు నమోదు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి అనుమతి లేకుండా డీజేతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ లీడర్ పై కేసు నమోదైన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ పట్టణ టు టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలో 14వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్ చిలుకూరు బాలకృష్ణ తన కార్యకర్తలతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులను ఉల్లంఘించి, ఎటువంటి అనుమతి లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఒక డీసీఎం లో డీజే బాక్స్ లను పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిన కారణంగా అట్టి డీజే ను సీజ్ చేయడమైనది. అంతే కాకుండా సదరు చిలుకూరి బాలకృష్ణ, నిర్వహాకులపై, డీజే యజమానీ పై కేసులు నమోదు చేయనైనదని తెలిపారు.
MOST READ :









