Miryalaguda : సిపిఎం ఆధ్వర్యంలో ధరల పెరుగుదలపై నిరసనలు..!
Miryalaguda : సిపిఎం ఆధ్వర్యంలో ధరల పెరుగుదలపై నిరసనలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి ముఖ్యల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నిత్యవసర వస్తువుల ధరలను వ్యతిరేకంగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతుందని ఆరోపించారు. ఒకపక్క నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల మరోపక్క ప్రజలపై పన్నులు వేస్తూ పేద ప్రజలపై మోయలేని ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతన్న, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వాటిని నివసిస్తూ పట్టణ, మండల,జిల్లా కేంద్రాలలో నిరసనలు తెలపనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ప్రజలకు విద్యా వైద్యం అందుబాటు లేకుండా పోయిందని, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుందని, అవినీతికి అంతం లేకుండా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తున్నట్లు ఉందని ధ్వజమెత్తారు.
ఒకరిపై మరొకరు ఆరోపణ చేసుకొని కాలయాపన చేసుకుంటున్నారని రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ ప్రజలను పట్టించుకోవడంలేదని వాటిని నిరసిస్తూ ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. త్వరలో మిర్యాలగూడలో జరగబోయే సిపిఎం పార్టీ జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల 21న ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, వినోద్ నాయక్, శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, ఆయూబ్, రేమిడల పరుశురాములు, ఎండి అంజాద్, వరలక్ష్మి, తిరుపతి రామ్మూర్తి, పగిదోజు రామ్మూర్తి, పాపా నాయక్, దయానంద, కోటిరెడ్డి, దేశిరం నాయక్, రామారావు, నాగేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
District collector : సన్న వడ్లు, దొడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Chapati : బరువు తగ్గేందుకు రాత్రిపూట చపాతి తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









