జిల్లా వార్తలుBreaking Newsఉద్యోగంతెలంగాణపెద్దపల్లి జిల్లా

District collector : ప్రభుత్వ భూముల సర్వే.. పరిశీలించిన అదనపు జిల్లా కలెక్టర్..!

District collector : ప్రభుత్వ భూముల సర్వే.. పరిశీలించిన అదనపు జిల్లా కలెక్టర్..!

ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో చేపట్టిన ప్రభుత్వ భూముల సర్వే కట్టుదిట్టంగా నిర్వహించాలని  అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం  అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ధర్మారం మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియను, ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 375 లోని ప్రభుత్వ భూమి 23 ఎకరాల 8 గుంటల సర్వే పనులను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఖిలా వనపర్తి గ్రామంలో ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ పూర్తయిందని, బొమ్మ రెడ్డి పల్లి గ్రామంలో అదనపు బృందాలను ఏర్పాటు చేసి త్వరగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కు సూచించారు.

ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ధర్మారం తహసిల్దార్ ఆయూబిద్దున్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు