Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalguda : వీళ్లు మామూలోళ్లు కాదు.. రెండేళ్లుగా.. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీలు.. అరెస్టు చేసిన పోలీసులు..!

Miryalguda : వీళ్లు మామూలోళ్లు కాదు.. రెండేళ్లుగా.. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీలు.. అరెస్టు చేసిన పోలీసులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో నిర్మితమవుతున్న యాదాద్రి ధర్మల్ పవర్  స్టేషన్లో దొంగతనాలకు పాల్పడుతున్న మరి కొంతమందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం డిఎస్పి రాజశేఖర్ రాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

గత రెండు సంవత్సరాలుగా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని నిర్మాణంలో గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో కాంట్రాక్ట్ కంపనీ BHEL నందు దొంగతనానికి పాల్పడి పరారీలో ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన రంజిత్ కుమార్ వర్మ మరియు అభయ్ ప్రతాప్ మౌర్య అను వ్యక్తులను స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి పట్టుబడి చేసి విచారించగా, ఇట్టి YTPS ప్లాంట్ కు సంబందించిన మరికొన్ని దొంగతనాలు వెలుగులోకి రావడం జరిగినది.

ఇదే క్రమంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ సంస్థ అయినటువంటి BHEL కు చెందిన సబ్ – కాంట్రాక్ట్ కంపనీ అయిన DURGA CRANE SRVICES వారు మరి కొన్ని అల్యూమినియం రోల్స్ కూడా దొంగతనానికి గురైనట్లు గుర్తించి దరఖాస్తు ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయంలో విచారణ జరపగ గతంలో దొంగతనానికి పాల్పడి అరెస్టు అయిన..

షేక్ మునీర్, కంబాల అశోక్, షేక్ మహాముద్, షేక్ యాకూబ్ పాషా లతో పాటుగా ఇర్కిగూడెం గ్రామానికి చెందిన గోపిశెట్టి అజయ్, పసుపులేటి కోటేశ్వర్ రావు మరియు పుల్లయ్య అను వ్యక్తులను ఇట్టి కేసులో నిందితులుగా గుర్తించి అరెస్టు చేయడం జరిగినది.

సదరు వ్యక్తులు BHEL యార్డ్ పరిసర ప్రాంతాలలో అన్ లోడ్ చేసినటువంటి స్టోర్ యార్డ్ నందు అల్యూమినియం వస్తువులను దొంగింలించి అట్టి వాటిని హైడ్ర ల ద్వారా తమ యొక్క వాహనలలో లోడ్ చేసుకొని బయట సుమారు ఒక అల్యూమినియం రోల్ విలువ 6.5 లక్షలు ఉండగా దానిని వీరు దొంగిలించి బయట ఒక లక్ష రూపాయల చొప్పున పాత ఇనుము షాప్ వ్యాపారులైన షేక్ శర్ఫ్ఫుద్దీన్, ఖైరుద్దేన్, ముజీబ్, వహీద్ అలీ అను వారికి అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగినది.

ఇట్టి ముఠాను నల్గొండ SP శ్రీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు, మిర్యాలగూడ DSP K.రాజశేఖర్ రాజు గారి పర్యవేక్షణలో, మిర్యాలగూడ రూరల్ CI, K. వీరబాబు గారు మరియు CCS CI జితేందర్ రెడ్డి, CCS ASI అఫ్జల్ అలీ, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, పుష్ప గిరి, ఇమ్రాన్, వహీద్, లింగారెడ్డి మరియు వారి సిబ్బంది ఇట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకొని అద్భుతమైన ప్రతిభతో పోలీస్ లపై ప్రజలకు ఉన్న నమ్మకాని మరింత పెంచడం జరిగినది. ఇక మీదట YTPS ప్లాంట్ నందు ఇలాంటి దొంగతనాలకు పాల్పడితే పోలీస్ లకు పట్టుబడుతామనే భయాన్ని నేరస్తులకు కలిగించడం జరిగినది.

నేరస్తుల వివరములు:
1. షేక్ మునీర్, తండ్రి: ఇమామ్, వయస్సు:31 సంవత్సరాలు, కులం: ముస్లిం వృత్తి: బిజినెస్, ఇంటి నెంబర్: C-7, NSP కాంప్, మిర్యాలగూడ పట్టణ.
2. కంబాల అశోక్, తండ్రి : వెంకటేశ్వర్లు, వయసు: 32 సంవత్సరాలు, కులం: మున్నూరు కాపు , వృత్తి: చేపలు పట్టడం మరియు ఆటో డ్రైవర్, నివాసం. ఇరికిగూడెం గ్రామం దామరచర్ల మండలం.
3. షేక్ మహమ్మద్, తండ్రి: ఇమామ్, వయసు: 30 సంవత్సరాలు, కులం: ముస్లిం, వృత్తి: గ్యాస్ స్టవ్ రిపేర్ ఇంటి నెంబర్: C-7, NSP కాంప్, మిర్యాలగూడ పట్టణం.
4. గోపిశెట్టి అజయ్ S/o శ్రీనివాస రావు, వయసు. 22 సంవత్సరాలు, నివాసం. ఇర్కిగూడెం.
5. పసుపులేటి కోటేశ్వర్ రావు S/o సాంబ శివ రావు, వయసు. 40 సంవత్సరాలు, నివాసం. ఇర్కిగూడెం.
6. రంజిత్ కుమార్ వర్మ S/o రామ్ గరీబ్ వర్మ, వృత్తి. హైడ్ర సూపర్ వైసర్, R/o ఉత్తర ప్రదేశ్
7. అభయ్ ప్రతాప్ మౌర్య S/o శివసాగర్ వృత్తి. హైడ్ర సూపర్ వైసర్, R/o ఉత్తర ప్రదేశ్.
8. కమలేశ్, వృత్తి. హైడ్ర సూపర్ వైసర్, R/o వెస్ట్ బెంగాల్
9. పుల్లయ్య, సెక్యూరిటి గార్డ్
10. మహమ్మద్ శర్ఫుద్దీన్, వృత్తి. పాత ఇనుము షాప్, R/o హైదరాబాద్.

11. మహమ్మద్ ఖైరుద్దీన్, వృత్తి. పాత ఇనుము షాప్, R/o హైదరాబాద్.
12. షేక్ ముజీబ్, వృత్తి. పాత ఇనుము షాప్, R/o హైదరాబాద్.
13. మహమ్మద్ వహీద్ ఆలీ, పాత ఇనుము షాప్, R/o హైదరాబాద్
14. షేక్ రజాక్, నివాసం, మిర్యాలగూడ.
15. నర్సయ్య.

నేరములు చేసే విధానం:

మొదటి ఐదుగురు నేరస్తులు రాత్రి సమయంలో YTPS యార్డ్ లోనికి అక్రమంగా ప్రవేశించి అప్పటికే తమకు పరిచయమున్న BHEL కంపనికి చెందిన స్టోర్ యార్డ్ వద్ద సెక్యూరిటి గా పనిచేసే సిబ్బందితో మరియు తమకు పరిచయమున్న హైడ్ర సూపర్ వైసర్ ల సహాయంతో దొంగిలించిన మెటీరియల్ ను మిర్యాలగూడ లోని అడ్డ మీద ఉండే కిరాయి వాహనాలలో మాట్లాడుకొని, దొంగిలించిన అల్యూమియమ్ మెటీరీయల్ ను తమ వాహనాలలో లోడ్ చేసుకొని హైదరాబాదు లోని ముషీరాబాద్ కు చెందిన షర్ఫోద్దీన్, ఖైరుద్దీన్, షేక్ ముజీబ్ మరియు వహీద్ అలీ కు విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నారు.

ఇదే క్రమంలో సదరు వ్యక్తులు సుమారు రెండు సంవత్సరాలుగా ఇట్టి దొంగతనాలకు పాల్పడుతుండగా గుర్తించి పట్టుబడి చేయడం జరిగినది. నేర పరిశోధనలో భాగంగా ఈ రోజు అనగా తేదీ.30.10.2024 రోజు మధ్యాహ్నం సమయంలో పోలీస్ వారికి సదరు వ్యక్తుల గురించి నమ్మదగిన సమాచారం రాగా తమ సిబ్బందితో కలసి పట్టుబడి చేయడం జరిగినది. ఇట్టి కేసులో ప్రస్తుతం అయిదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగినది.

అదేవిదంగా మరొక 10 మంది నేరస్తులను అరెస్టు చేసి, మరి కొంత విలువ గల ప్రాపర్టీ ని రికవరీ చేయవలసి ఉన్నది. ఇట్టి దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి ప్రజలకు పోలీసు లపై మరింత నమ్మకం కలిగేలా చేసిన CI,మిర్యాలగూడ రూరల్ గారిని, మరియు CCS CI జితేందర్ రెడ్డి, CCS ASI అఫ్జల్ అలీ, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, పుష్ప గిరి, ఇమ్రాన్, వహీద్, లింగారెడ్డి మరియు వారి సిబ్బందిని అబినందించడం జరిగింది.
స్వాదిన సొత్తు వివరములు:
1 . 15,35,000/- నగదు.
2. (03) సెల్ ఫోన్.

MOST READ : 

మరిన్ని వార్తలు