తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలువ్యవసాయం

Agriculture : ఆధునిక పరికరాలతో సాగు.. చెరుకు సాగులో కూలీల కొరతను అధిగమించే యంత్రాలు..!

Agriculture : ఆధునిక పరికరాలతో సాగు.. చెరుకు సాగులో కూలీల కొరతను అధిగమించే యంత్రాలు..!

నేలకొండపల్లి, మన సాక్షి:

చెరుకు సాగులో కూలీల కొరత ను అధిగమించేందుకు మధుకాన్ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు నాటే, కటింగ్ యంత్రాలను ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని బోదులబండ, మండ్రాజుపల్లి, కోనాయిగూడెం గ్రామాలలో  యంత్రం (సీడ్లింగ్స్ ప్లాంటర్) ద్వారా చెరుకు నాటే పద్దతి పై అవగాహాన కల్పించారు.

రైతులను ప్రోత్సాహించేందుకు రూ.2.50 లక్షలు వెచ్చించి… తమిళనాడు లోని కొయ్యంబత్తూరు నుంచి తెప్పించారు. రోజుకు 5 నుంచి 7 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేయవచ్చునని పేర్కోన్నారు. యంత్రం ఎలా చెరుకు నాటాలి అనే యాంత్రీకరణవిధానాన్ని డెమో ద్వారా చూపించారు. అదే విధంగా చెరుకు నరికే యంత్రాల కటింగ్ చేసే విధానం ను వివరించారు.

చెరుకు సాగే చేసే రైతులకు కూలీల కొరత ఉండదని పేర్కోన్నారు. దీనికి తోడు ప్యాక్టరీ ద్వారా ఉచితంగా చెరుకు విత్తనం ను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరపనేని రామకృష్ణ. మాజీ ఎంపీటీసీ కట్టెకోల సుధాకర్, సోసైటీ మాజీ చైర్మన్ చింతనిప్పు సైదులు, రైతు ప్రతినిధులు కొచ్చేర్ల శ్రీనివాసరావు, మేకల నారాయణ, మధుకాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు