Paddy : ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ధాన్యం అక్రమ రవాణా..!
Paddy : ఏపీ నుంచి తెలంగాణకు భారీగా ధాన్యం అక్రమ రవాణా..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఏపీ నుంచి తెలంగాణ కు అక్రమంగా వస్తున్న ధాన్యం లారీలను గ్రామస్తులు – అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ లోని గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల నుంచి ఆదివారం దాదాపు 70 లారీల ధాన్యం ను తెలంగాణ లోకి వస్తున్నాయి. ముదిగొండ మండలం లోని వల్లభి చెక్పోస్టు వద్ద పను చెల్లించినేలకొండపల్లి మండలం లోకి ప్రవేశించాయి.
కాగా మండలం లోని చెరువుమాధారం గ్రామానికి చెందిన ప్రజలు లారీలను అడ్డుకున్నారు. ఏపీ కి చెందిన ధాన్యం ను ఎక్కడ ఎలా విక్రయిస్తారని… ప్రభుత్వం అందించే బోనస్ ను కాజేసేందుకు తెలంగాణలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 లారీలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
లారీలను పోలీసే స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్పయ్ డీఎస్ ఓ చందనక్కుమార్, ఆర్.ఐ.నరేష్ లు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కుచేరుకున్నారు. తెలంగాణలోకి రావటానికి వీలు లేదని వచ్చిన లారీలను అన్నింటిని తిరిగి ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో లారీలు ఏపీకి వెనుతిరిగాయి. కాగా వ్యవసాయ మార్కెట్ అధికారులు సెస్సు కోసం రాష్ట్రంలోకి అనుమతించటం పట్ల అగ్రహాం వ్యక్తం చేశారు.
తమ వద్ద నుంచి సెస్సు తీసుకున్న తరువాత ఎలా వెనక్కి తిరిగి వెళ్తామని లారీ డ్రైవర్లు అధికారులతో వాగ్వివాదం కు దిగారు. ఏపీకి చెందిన అక్రమార్కులు.. తెలంగాణ లోని బోనస్ ను పొందేందుకు ఇక్కడి అధికారుల సహాకారంతో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ అక్రమఅధికారుల సహాకారంతో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ దందా పై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు. అదే విధంగా మార్కెట్ అధికారులు ఫీజు వసూలు పై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు.
మొత్తం మీద ఏపీ కి చెందిన ధాన్యం బోనస్ ను కొల్లగోట్టేందుకు అక్రమార్కులు సరికొత్త పధకం పన్నినట్లు తెలుస్తుంది. దాదాపు 20 రోజులుగా ఏపీ నుంచి తెలంగాణ భారీ ఎత్తున లారీలు ప్రవేశస్తున్నాయి. కాగా ఈ విషయం పై జిల్లా అధికారులు పని తీరు పై కూడ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.










