Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి గుడ్ న్యూస్ అందింది. బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఇటీవల భారీగా కొనసాగుతున్నాయి. దాంతో ఇటీవల పెరిగినట్టే పెరిగిన బంగారం ధర శనివారం తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.
100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 1600 రూపాయలు తగ్గగా, 22 క్యారెట్స్ 100 గ్రాములకు 1500 రూపాయలు తగ్గింది. శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర హైదరాబాద్ లో
7, 80,000 ఉండగా శనివారం 1600 రూపాయలు తగ్గి 7,78,400 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర శుక్రవారం 7,15,000 ఉండగా 1500 రూపాయలు తగ్గి 7,13,500 రూపాయలుగా ఉంది.
అయితే హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ శనివారం 77,840 ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 71,350 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా అవే ఉన్నాయి.
RELATED NEWS :









