Miryalaguda : రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ మానుకో.. చింతరెడ్డి..!
Miryalaguda : రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ మానుకో.. చింతరెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ రాజకీయాలు మానుకుని రైతుల అభివృద్ధి కోసం పాటుపపడాలని నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రైతు రుణమాఫీ 35 శాతం వరకే జరిగిందని, అలాగే రైతు భరోసా బోగస్ అయిందన్నారు.
గత వానాకాలం, వేసవి కాలం రెండు సీజన్లు కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే రైతు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర పడుతుందని,ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులందరికి న్యాయం చేయాలని సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వతహాగా రైతు కాబట్టి ఆయనకు రైతుల బాధలు తెలుసునని, రైతుల కోసం రైతు రుణమాఫీ, రైతు బంధు,రైతు బీమా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేటిఆర్ పై రివెంజ్ రాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలికారు.
MOST READ :









